![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -267 లో.....సీతాకాంత్ కావాలని చెయ్ కోసుకొని రామలక్ష్మి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటుంది. తన తల్లి చిన్నప్పటి నుండి తనకి ఎంతగా ప్రేమ పంచిందో చెప్తాడు. అంటే మీరు కావాలని ఇలా చేసుకొని నీ తల్లి గురించి నాకు చెప్పాలని ట్రై చేస్తున్నారా అని రామలక్ష్మి అనుకుంటుంది.
మరొకవైపు సందీప్ కి శంకర్ ఫోన్ చేస్తాడు. సందీప్ లిఫ్ట్ చెయ్యకపోవడంతో మెసేజ్ చేస్తాడు. ఆ మెసేజ్ చూసుకొని సందీప్ బయటకు వస్తాడు. ఇప్పుడు డబ్బులు లేవని సందీప్ రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో శంకర్ కోపంగా వెళ్ళిపోతాడు. ఏం అంటుండు సందీప్.. నువ్వు ఇప్పుడు ఎంత అన్న కూడా వాడు ఒక్కరూపాయి ఇవ్వలేడు. నేను చెప్పినట్టు చేస్తే నీకు ఇరవై కాదు అరవై లక్షలు వస్తాయని మాణిక్యం అనగానే.. అతను సరే అంటాడు.
మరోవైపు శ్రీలత , శ్రీవల్లి లు ఏదో ప్లాన్ చేస్తుంటే రామలక్ష్మి వెళ్లి వాళ్ళకి కౌంటర్ ఇస్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ డల్ గా ఉంటాడు. తన చెయ్యి పట్టుకొని నందిని అడ్వాంటేజ్ తీసుకొవాలనుకుంటుంది కానీ ఆ ఛాన్స్ సీతాకాంత్ ఇవ్వడు. అప్పుడే రామలక్ష్మి వచ్చి సర్ కి ఫైల్ ఇవ్వు.. సీఈఓ కదా చూస్తాడని నందినితో అంటుంది. రామలక్ష్మి ఏదో సర్దుతుంటే నెక్లెస్ కిందకి పడిపోతుంటే.. సీతాకాంత్ పట్టుకుంటాడు. కొన్ని కొన్ని పడిపోకుండా పట్టుకోవాలని సీతాకాంత్ అంటాడు. మీ చేత్తో మీరే నెక్లెస్ పెట్టండి అని రామలక్ష్మి అనగానే.. సీతాకాంత్ పెడతాడు. ఆ తర్వాత సందీప్ కి శంకర్ ఫోన్ చేసి.. మీ అన్నయ్య దగ్గరికి వెళ్తున్న అంటాడు. దాంతో సందీప్ టెన్షన్ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |